అనుమతి లేకుండా పోర్న్ సినిమాలు..మహిళలకు 91 కోట్ల పరిహారం!

0

తమ అనుమతి లేకుండా పోర్న్ సైట్లలోకి తమ వీడియోలను ఎక్కించారని అంటూ.. యూఎస్ కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పై ఆసక్తిదాయకమైన తీర్పు వచ్చింది. సదరు పోర్న్ సైట్ ఆ పోర్న్ స్టార్లకు 91 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. యూఎస్ లో కొన్ని చోట్ల పోర్న్ లీగల్. అందులో భాగంగా కొందరు మహిళలు పోర్న్ సినిమాల్లో నటించారు. అయితే ఆ పోర్న్ ను ఎక్కడ ప్రదర్శించాలనే అంశం మీద వారు ఒప్పందం చేసుకున్నారట.

వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వెబ్ లోకి ఎక్కించకూడదని కేవలం డీవీడీల్లో మాత్రమే పెట్టాలనేది వారు చేసుకున్న ఒక ఒప్పందం. అంతే కాకుండా.. వాటిని తమ దేశం ఆవల మాత్రమే ప్రదర్శించాలనే ఒప్పందం కూడా పెట్టుకున్నారట. అయితే ఆ ఒప్పందాలకు భిన్నంగా.. ఒక పోర్న్ సైట్ వాళ్లు.. మొత్తం వీడియోలను ఒక వెబ్ సైట్ కు ఎక్కించారట.

ఆ పోర్న్ చిత్రాల్లో నటించిన వారికి ఆ విషయం గురించి తెలియదట. అలా కొన్నాళ్లు అవి ప్రదర్శితం అయినట్టుగా తెలుస్తోంది. చివరకు ఆ విషయాన్ని గ్రహించి వారు కోర్టుకు ఎక్కారు. తమ అనుమతి లేకుండా తమ పోర్న్ సినిమాలను వెబ్ లో పెట్టి ప్రదర్శించాలని సదరు వెబ్ సైట్ పై వారు దావా వేశారు. అందుకు పరిహారాన్ని కోరారు.

వారి పిటిషన్ పై విచారించిన యూఎస్ కోర్టు మొత్తం 22 మంది మహిళలకు 91 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని ఆ వెబ్ సైట్ ను ఆదేశించింది. ఆ వెబ్ సైట్ సబ్ స్క్రిప్షన్ల ద్వారా పోర్న్ ను అందిస్తుందట. ఈ నేపథ్యంలో..భారీ జరిమానా ఆ సైట్ పడినట్టుగా అయ్యింది. ఆ పోర్న్ స్టార్లకు భారీ పరిహారం లభిస్తున్నట్టుంది!
Please Read Disclaimer