ఉన్న వాటికే దిక్కులేదు.. మళ్లీ కొత్తవంట

0

మంచి రోజులు తీసుకొస్తామంటూ 2014లో ప్రధాని పీఠం ఎక్కిన నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని మరోసారి అధికారం చేజిక్కించుకున్న అనంతరం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఉద్యోగులతో పాటు సామాన్యులకు ఆశలు కల్పించనట్టే ఉన్నాయి.. కానీ లోతుగా వెళ్లి చూస్తే ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండేలా బడ్జెట్ లేదని తెలుస్తోంది. దీంతో మదుపరులతో పాటు సామాన్య ప్రజానీకం ఈ బడ్జెట్ ను హర్షించలేదు.

అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రజల ముఖాల్లో ఆనందాలు కనిపించలేదు. ఇక నరేంద్ర మోదీ మొదటి హయాంలో ఊదరగొట్టిన అంశం ‘స్మార్ట్ సిటీస్’. ఏవో ర్యాంకులు సర్వేలు చేసి స్మార్ట్ సిటీస్ ను చేస్తామని ఘనంగా ప్రకటించి ప్రచారం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్యనాయుడు తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ స్మార్ట్ సిటీస్ అంశం గట్టెక్కినట్టు తెలుస్తోంది. ఆ సిటీస్ ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. అయితే తాజాగా ఈ స్మార్ట్ సిటీస్ అంశం మరోసారి బడ్జెట్లో కొంత చర్చకు వచ్చింది.

బడ్జెట్ ను నిశితంగా పరిశీలించగా ఒకచోట ఐదు కొత్త స్మార్ట్ సిటీస్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అది ఎలాగంటే రాష్ట్రాల సహకారంతో స్మార్ట్ సిటీస్ కు రూపకల్పన చేసినట్లు బడ్జెట్ లో ఉంది. అవి మూడు అంశాలతో ముడిపడి ఉన్నాయని వివరించింది. ఎకనామిక్ కారిడర్ మౌలిక సదుపాయాలకు పెద్దపీట సాంకేతిక అంశాలతో ముడిపడి ఉండడం అంశాలతో ఈ స్మార్ట్ సిటీస్ ను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

అయితే ఈ స్మార్ట్ సిటీస్ అంశం ఇప్పుడు అంతగా చర్చనీయాంశం కావడం లేదు. ఎందుకంటే గతంలో ప్రకటించిన వంద స్మార్ట్ సిటీస్ ను ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు కొత్తగా మరో మూడు నగరాలను స్మార్ట్ సిటీస్ ను చేస్తామని ప్రకటించడంతో పలువురు నవ్వుతున్నారు. గతంలో వాటికే దిక్కులేదు..

ఇప్పుడు మళ్లీ కొత్తగా మూడు నగరాలను స్మార్ట్ సిటీస్ గా తీర్చిదిద్దుతారంటా అని వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు. ఈ స్మార్ట్ సిటీస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలు ఎంపికయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఏ నగరం ఇప్పటివరకు స్మార్ట్ సిటీస్ గా ఒక్కటీ కూడా కాలేదు. ఇప్పుడు బడ్జెట్ లో రాష్ట్రాల సహాయంతో పీపీపీ విధానంలో అని మెలిక పెట్టడంతో ఇక ఆ ఐదు నగరాలు స్మార్ట్ సిటీస్ అయినట్టే మనం చూసినట్టే అని ప్రజలు పేర్కొంటున్నారు.
Please Read Disclaimer