9నెలల గర్భిణిని రేప్ చేస్తూ సెల్‌ఫోన్లో రికార్డ్… కరీంనగర్‌లో కామాంధుడి పైశాచికం

0

కరీంనగర్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన వ్యక్తి నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం కొన్నేళ్లుగా బొమ్మకల్‌ గ్రామంలో నివాసం ఉంటోంది. భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా.. అతడి భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణి. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన భర్త ఉద్యోగానికి వెళ్లగా… ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది.

మధ్యాహ్న సమయంలో డిష్ రిపేర్ పేరిట ఇంట్లోకి వచ్చిన కనపర్తి రామకృష్ణ అనే వ్యక్తి మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. దీంతో ఆమె బెదిరించి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె భర్తకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఆ కామాంధుడితో పెనుగులాటలో మెడలోని పుస్తెలతాడు తెగిపోవడంతో బాధితురాలు దాన్ని కట్టుకుంటున్న సమయంలో భర్త ఇంటికి వచ్చాడు.

ఆమె మెడపై గాయాలు కనిపించడంతో, ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి అతడు ఏం జరిగిందని నిలదీయగా బాధితురాలు జరిగిన విషయాన్ని చెప్పింది. ఇది బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన దంపతులు కొద్దిరోజులు ఎవరికీ చెప్పలేదు. అయితే సోమవారం కరీంనగర్‌ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కనపర్తి రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు మొబైల్‌ ద్వారా వీడియో రికార్డ్ చేశాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు దీనిపైనా దర్యాప్తు చేస్తున్నారు.
Please Read Disclaimer