అద్భుత దృశ్యం..అన్నగారికి మూడు తరాల నివాళి..!

0

హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అద్బుత దృశ్యం ఆవిషృతమైంది. ఎన్టీఆర్కు మూడు తరాల నివాళి అర్పించిన ఘటన చోటుచేసుకున్నది. ఇవాళ (జవవరి 18) ఎన్టీఆర్ వర్ధంతి. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. అనతి కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘటన రామారావుది. ఆయన సినీనటుడిగా కూడా ఎంతో ఖ్యాతి సంపాధించారు. దేశంలోనే ఏ నటుడు వేయలేనన్ని విభిన్నపాత్రలను ఆయన పోషించారు. ఆయన చనిపోయి 25 ఏళ్లు గడిచింది. 

ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా నివాళి అర్పించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి లోకేశ్ ఆయన కుమారుడు నారా దేవాన్ష్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మూడు తరాల వాళ్లు ఎన్టీఆర్ కు నివాళి అర్పించారంటూ ఈ ఫోటో సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.

అన్నగారికి మూడు తరాల నివాళి అంటూ ఈ అరుదైన ఫొటోను తెలుగుదేశం వర్గాలు పెద్దఎత్తున షేర్ చేస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం నాయకులు టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబీకులతో పాటు పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు.