దేశ ద్రోహం…తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై నటుడు శివాజీ సంచలన ఆరోపణలు

0

ఆపరేషన్ గరుడతో ఎన్నో సంచలనాలకు తెరలేపిన నటుడు శివాజీ. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే శివాజీ ఎన్నికల తరువాతనుండి కనిపించడం లేదు. దేశద్రోహం అనే ప్రోమో వీడియో తో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి కాస్త తెలుసుకుందాం.

శివాజీ సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ సమయం గడిపారు. ఈ వీడియో లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసారు. ఒక కాంట్రాక్టర్ తో చేతులు కలిపి వీరిద్దరూ కొన్ని వేల కోట్లని పంచుకుంటున్నారని అన్నారు. దానికి సంబందించిన సాక్షాలన్నీ ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, పోలవరం రివర్స్ టెండరింగ్ కానీ, ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్టు లో ప్రజల సొమ్ముని ఎలా పంచుకుంటున్నారో చూపెడతానని అన్నారు.

వీరిద్దరికి మేఘ కృష్ణ రెడ్డి కాంట్రాక్టర్ గా ఉండటానికి గల కారణాల్ని వివరించే ప్రయత్నం చేసారు. గత ఏడేళ్లలో అయన ఆదాయం 26 వేల కోట్లకు చేరిందని శివాజీ అన్నారు. ఎలక్ట్రిక్ బస్సు ల సంబంధిత సంస్థ ఈయనది కాదు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి కి సంబందించినది. ఈ రెండిటి సంస్థల విషయాలని కూడా బయట పెడతానని అన్నారు. ప్రజల కష్టాన్ని సొమ్ములుగా చేసి వీరి జేబుల్లో నింపుకుంటున్నారని ఇది దేశ ద్రోహం కాకా ఇంకేమంటారు అని ప్రశ్నించారు.

నాలుగు నెలల క్రితమే ప్రధానికి, హోం మంత్రికి, రాష్ట్ర పతికి మెయిల్ పెట్టానని చెప్పారు. దేశానికి చేస్తున్న నష్టం, బీజేపీ కి తెస్తున్న చెడ్డ పేరు, తదితర ప్రాజెక్టుల అంశాలన్నిటినీ బయట పెడతానని అన్నారు. తనకు ప్రాణ హాని ఉందని, ప్రెస్ మీట్ పెడితే దీనిని టెలికాస్ట్ చేసే దైర్యం ఎవరు చెయ్యరని ఇలా వీడియో మీ ముందు వుంచుతున్నానని అన్నారు. నాయకుల్లో ఎంతో కొంత ఆలోచన తీసుకురావాలనే మేఘ దోపిడీని ప్రతి వారం మీ ముందు ఉంచుతానని అన్నారు.
Please Read Disclaimer