టెలికాం పై ‘ఏజీఆర్’ పిడుగు.

0

సుప్రీం కోర్టు తీర్పు భారత టెలికాం పరిశ్రమను తీవ్రమైన నష్టాల కు గురి చేస్తోంది. ఈ తీర్పు కారణం గా ఆయా కంపెనీల పై పెను భారం పడి అవి మూతపడే దిశగా సాగుతున్నాయి.

* టెలికాం కంపెనీలకు గుది బండగా ఏజీఆర్
టెలికాం వ్యాపారేతర ఆదాయలను టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్)గా పరిగణించాలని ప్రభుత్వం చేసిన వాదనకు ఇటీవల సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. అయితే నిబంధనల ప్రకారం వారు బయట పొందిన ఆదాయంలో ఈ ఏజీఆర్ లో నిర్ధిష్ట మొత్తాన్ని లైసెన్స్ ఫీజు స్పెక్ట్రం వినియోగ చార్టీల కింద ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇదే టెలికాం కంపెనీలకు పెను భారంగా మారిపోతోంది.

*టెలికాం కంపెనీలకు వేల కోట్ల నష్టం
సుప్రీం కోర్టు ఏజీఆర్ పై తీర్పునిచ్చిన కారణం గా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికం లో వోడాఫోన్-ఐడియా ఏకంగా రూ.50921 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇక భారత నంబర్ 1 టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ రూ.23045 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంటే దాదాపు 74వేల కోట్లను రెండు దిగ్గజ కంపెనీలు కోల్పోవడం టెలికాం రంగ చరిత్ర లోనే అతిపెద్ద నష్టం గా పరిగణిస్తున్నారు. టెలికాం కంపెనీల చరిత్ర లోనే ఇదే అత్యధిక త్రైమాసిక నష్టాలు కావడం గమనార్హం. దీంతో వోడాఫోన్-ఐడియా ఎయిర్ టెల్ షేర్లు కూడా భారీగా నష్టపోయి లాస్ అయ్యాయి.

*ఏజీఆర్ తో మొత్తం బకాయిలు రూ.14 లక్షల కోట్లు
ఏజీఆర్ కు సంబంధించి ఎయిర్ టెల్ పై భారీగా భారం పడుతోంది. ఎయిర్ టెల్ లో టాటా టెలినార్ విలీనం కావడం తో ఆ రెండు కంపెనీల భారం ఎయిర్ టెల్ పై తడిసి మోపడవుతోంది. ఏకంగా మొత్తం రూ.52187 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వోడాఫోన్-ఐడియాలు కలిసి రూ.54184 కోట్లు చెల్లించాలి. ఈ బకాయిలను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. టెలికాం విభాగం కూడా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం ఏకంగా రూ.1.4 లక్షల కోట్లు కావడం పరిశ్రమ ను కృంగ దీస్తోంది.

*టెలికాం పరిశ్రమ కుదేలు
ఏజీఆర్ చెల్లింపుల కారణంగా టెలికాం పరిశ్రమ కుదేలు కావడం ఖాయం గా కనిపిస్తోంది. ప్రభుత్వం ఏజీఆర్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కంపెనీలు మొర పెట్టుకుంటున్నాయి. దీనిపై సుప్రీం కోర్టుకు ఎక్కడానికి వోడాఫోన్-ఐడియా రెడీ అయ్యింది. ఇక ఏజీఆర్ పైనిర్ణయం తీసుకోక పోతే తమ కంపెనీ టెలికాం పరిశ్రమ నుంచే వైదొలుగుతుందని వోడాఫోన్-ఐడియా హెచ్చరికలు పంపింది. ప్రభుత్వం నిర్ణయంపైనే తమ కంపెనీ మనుగడ ఆధారపడి ఉందని స్పష్ం చేసింది.




Please Read Disclaimer