తలాక్ ఫస్ట్రేషన్ శబరిమలై మీద చూపించటమా?

0

సెక్యులర్ దేశంలో.. అన్ని మతాలు ఒక్కటే అయినప్పుడు మతాల ఆధారంగా చట్టాలు ఉండటం ఏమిటి?  దేశంలో అందరూ ఒక్కటే. అలాంటప్పుడు మతం పేరుతో ఒకరు రెండు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఓకే.. కానీ.. మరొకడు మాత్రం అలాంటి పని చేస్తే తప్పు అనటంలో అర్థం ఉందా?   డిజిటల్ యుగంలోనూ మతం ఆధారంగా చట్టాల్ని అమలు చేయటానికి మించిన తప్పు మరేదీ ఉండదు.

ఓట్ల రాజకీయంలో భాగంగా స్వార్థపూరిత రాజకీయ నాయకుల తీరుతో.. ఒకే దేశంలో మెజార్టీలు అదే పనిగా అవస్థలు ఎదుర్కోవటం.. అవమానాలకు గురి కావటం మరే దేశంలోనూ సాధ్యం కాదేమో?  కోట్లాది మంది ముస్లిం మహిళలు.. ట్రిపుల్ తలాక్ కారణంగా తాము అవస్థలకు గురి అవుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు.. ముస్లిం పురుషుల గురించి అదే పనిగా ప్రస్తావించటం ఏమిటో అర్థం కాదు.

ట్రిపుల్ తలాక్ చట్టంపై ఉన్న ఫస్ట్రేషన్ తో సంబంధం లేని అంశాల్ని లింకు చేసే ధోరణి అసద్ లో అంతకంతకూ ఎక్కువ అవుతుంది. పావు గంట టైమిస్తే.. దేశంలోని ముస్లింలను.. హిందువుల సంఖ్యను సమం చేస్తామన్న తీవ్రమైన మాటను మరోసారి భారీ బహిరంగ సభలో మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యకు ఇప్పటివరకూ చట్టం తన పని తాను చేయని పరిస్థితి.

ఆధునిక సమాజంలో అక్బరుద్దీన్ లాంటి నేతల మాటలు గర్హనీయమే కాదు.. శాంతిభద్రతల సమస్యల్ని తెచ్చి పెడతాయన్న విషయాన్ని మర్చిపోవటం దురదృష్టకరమని చెప్పక తప్పదు. ట్రిపుల్ తలాక్ ను కోరుకుంటున్న ముస్లిం మహిళలు ఎంతమందన్న విషయం.. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ముస్లిం మహిళలు ఓట్లు వేసిన తీరును పలువురు ప్రస్తావిస్తుంటారు. ట్రిఫుల్ తలాక్ కారణంగా ముస్లిం పురుషులు జైలుకు వెళితే.. ఇంట్లోని వారి ఉపాధి మాటేమిటి? అంటూ ప్రశ్నించే మాటలు వింటే అసద్ మైండ్ సెట్ ఎంత కురచదో అర్థమవుతుంది.

తప్పు చేస్తే జైలుకు వెళతారే తప్పించి.. లేకుండా లేదు కదా?  ట్రిఫుల్ తలాక్ చెప్పేయటం ద్వారా.. అప్పటివరకూ తన భార్యగా ఉన్న మహిళను కచ్ఛితంగా ఆదుకుంటారన్న దానికి గ్యారెంటీ ఉందా? అంటే సమాధానం అందరికి తెలిసిందే. నిజంగా అలాంటి భావనే ఉంటే.. తలాక్ చెప్పడు కదా?  అతెందుకు.. ముస్లిం జంటలు అస్సలు విడాకులు తీసుకోవద్దని చెప్పట్లేదు కదా?  కేవలం.. ఇప్పుడున్న పద్ధతిని మారుస్తున్నారంతే. దానికే ఎందుకంత అక్రోశం అన్నది అర్థం కాదు.

ట్రిఫుల్ తలాక్ అన్నది ఉండాలని కోరుకునే అసద్ లాంటోళ్లు.. తమకున్న ఫస్ట్రేషన్ ను తీర్చుకోవటానికి శబరిమల అంశాన్ని తేవటం ఏమాత్రం సబబు కాదు. ఎందుకంటే.. శబరిమల దర్శనం చేసుకోవాలని తపించే మహిళలు గుప్పెడు మంది కూడా ఉండరు. దేవుడి పట్ల భక్తి.. నమ్మకం లేని వారే ఇలాంటివి చేస్తారు. శబరిమలకు మహిళల్ని తీసుకెళ్లాలంటూ ఎటకారం ఆడేసే ఓవైసీ.. శబరిమలకు కొన్ని వయస్కుల మహిళల్ని పంపకూడదంటూ.. కిలోమీటర్ల దూరం వరకూ మానవహారం ద్వారా శాంతియుతంగా నిరసన చేయటాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి.. నిరసన తెలపటం అసద్ కు తెలీదా?  నిజంగా.. ట్రిఫుల్ తలాక్ కారణంగా మహిళలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటే.. వారు బయటకు రాకుండా ఉంటారా?  ఇలాంటి ప్రాక్టికల్ అంశాల్ని వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం లాంటి వాటితో అసద్ లాంటి నేతలు దేశానికి  దారుణమైన డ్యామేజీ చేస్తున్నారని చెప్పక తప్పదు. 
Please Read Disclaimer