సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

చైనాకి బయల్దేరిన ఎయిరిండియా స్పెషల్ ఫ్లైట్!

0

చైనాలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి తొలుత పంజా విసిరిన వుహాన్ కు బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయి నిషేధిత నగరంలా మారింది. మరోవైపు ప్రపంచంలోని వివిధ దేశాలకు వేగంగా విస్తరిస్తూ మరింత కలవరానికి గురిచేస్తోంది. అంతేకాదు మరో పది రోజుల్లో ఈ వైరస్ తీవ్రరూపం దాల్చి మృతులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరిలో ఆందోళన ఎక్కువైంది.

ఇకపోతే ఇప్పటికే చైనాలో 170 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్ ఇండియానూ భయపెడుతోంది. దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ అత్యవసర భేటీ నిర్వహించింది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మరోవైపు చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకూ చర్యలు ఉదృతమయ్యాయి. చైనాకు ఉన్నత చదువుల కోసం – ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు వేలల్లో ఉన్నారు. వారందరినీ రక్షించేందుకు బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. ఈ వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన సుమారు 400 మంది భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ఎయిరిండియా విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి చైనాకు బయల్దేరింది. ఇది ఆరు గంటలపాటు ప్రయాణించి చైనా చేరుకోనుంది.

వూహాన్ నుంచి ఇక్కడికి తెచ్చే భారతీయులను ఢిల్లీ – హర్యానాలోని మానెసార్ లలో గల ఆసుపత్రుల్లో 14 రోజులపాటు ఐసోలేషన్ సెంటర్లలో ఉంచుతారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్ ఫెక్షన్ ముప్పు లేకుండా చూసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు వైద్య నిపుణులు ఇందులో వెళ్తున్నారు. విమాన సిబ్బందికి ప్రయాణికులకు అవసరమైన మాస్క్లను వెంట తీసుకెళ్తున్నారు. రెండు విమానాల ద్వారా వుహాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నారు. వూహాన్ లో కరోనా సోకనివారినే విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వనున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా మన ఎయిరిండియా విమానం వూహాన్ సిటీలో సుమారు రెండు – మూడు గంటలపాటు ఉంటుంది. రేపు తెల్లవారు జామున రెండు గంటలకు తిరిగి భారత్ బయల్దేరుతుంది.
Please Read Disclaimer