మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానే: మోదీ

0

మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానే అని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమంలో రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి సమగ్ర పురోగతికి అతడి భాషా పురోగతే మూలం అని.. ఆధునిక హిందీ భాష పితగా పేరొందిన భారతేందు హరిశ్చంద్ర 150 ఏళ్ల క్రితం చెప్పారని ప్రధాని మోదీ తెలిపారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంతగా అభివృద్ధి సాధించినా వృథానే అన్నారు.

మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా పురోగతి సాధ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని ధార్‌చులాలో ప్రజలు తమ భాషను కాపాడుకుంటున్నారంటూ ప్రధాని వారిపై ప్రశంసలు గుప్పించారు. 19వ శతాబ్దానికి చెందిన తమిళకవి సుబ్రహ్మణ్య భారతి కవితలను ప్రస్తావించిన ప్రధాని మోదీ తమిళులను ఆకట్టుకున్నారు.

మన నాగరికత, సంస్కృతి, భాషలు.. ప్రపంచానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్‌సీసీ డే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, ఎగ్జామ్ వారియర్స్, ఫిట్ ఇండియా తదితర అంశాల గురించి మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై అవగామన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి 2019ను అంతర్జాతీయ స్వదేశీ (ఇండిజెనస్) భాషల సంవత్సరంగా గుర్తించింది.
Please Read Disclaimer