ఉమ్మడి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఇంద్రకరణ్

0

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రంలో బ్రేక్ అయ్యింది. ఏన్నో ఏళ్లుగా సాగుతున్న సెంటిమెంట్ ఇంద్రకరణ్ రెడ్డి.. కేసీఆర్ పుణ్యమా అని మాటాష్ అయ్యిందని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలోని ఏ ప్రభుత్వంలో అయినా.. దేవాదాయ మంత్రిగా వ్యవహరించే వారు.. తర్వాత జరిగే ఎన్నికల్లో ఓటమిపాలు కావటం దాదాపుగా జరిగేది. ఒకవేళ.. ఎన్నికల్లో గెలిచినా.. రెండో దఫా వారికి అమాత్య పదవి లభించేది కాదు.

ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 8 మంది నేతలు దేవాదాయ మంత్రులుగా వ్యవహరించారు. వారిలో ఎవరికి మరోసారి మంత్రి పదవి లభించలేదు. కానీ.. ఆ సెంటిమెంట్ ను దిగ్విజయంగా బ్రేక్ చేశారు నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

36 ఏళ్లుగా సాగుతున్న సెంటిమెంట్ తాజాగా ఆయన రెండోసారి దేవాదాయ శాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయటంతో రికార్డు బద్దలైంది. 2014లో ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖామంత్రిగా వ్యవహరించిన ఇంద్రకరణ్ రెడ్డి.. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు నెలలు దాటిన తర్వాత కేబినెట్ విస్తరణ జరిపిన కేసీఆర్.. ఇంద్రకరణ్ రెడ్డికి పాత శాఖనే కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటంతో దశాబ్దాల సెంటిమెంట్ కు బ్రేక్ కావటమే కాదు.. అరుదైన రికార్డు ఇంద్రకరణ్ ఖాతాలో పడినట్లైంది.


Please Read Disclaimer