చంద్రబాబు కూ ఛాన్స్ దొరికింది చంద్రబాబు

0

2019 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన చంద్రబాబు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఎప్పుడు మూటకట్టుకొని అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ఎన్నడూ ఎదుర్కొనని గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎన్నడూ లేనంత అనిశ్చితి, నిరాశలో ఆ పార్టీ నేతలు కూరుకుపోయారు. టీడీపీ కథ కంచికే అని ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్నారు టీడీపీ అధినేత.

ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీని పక్కకు నెట్టి జనసేన పార్టీ పై ఫోకస్ పెట్టటం కూడా టీడీపీకి మింగుడు పడటం లేదు. ఇసుక సమస్య విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ విజయం కావడం టీడీపీ నేతలు చేసిన ఇసుక పై పోరాటం విఫలం కావడంతో టీడీపీని కనీసం ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదనే భావన టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. బాబు, తనయుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను బలిపశువును చేశారన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ నెల 29 రానున్న రాంగోపాల్ వర్మ సినిమాలో కూడా ఇదే విషయం తీసుకురావడం. దీంతో ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి. అయితే.. సరిగ్గా ఈ సమయంలో అమరావతి అంశం తెరపైకి రావడం టీడీపీ అధినేతకు ఊరట దొరికినట్లైంది.

చంద్రబాబు హయంలో శంకుస్థాపన చేసిన అమరావతి.. రాజధాని కాకుండా పోతోందని మదనపడుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయం ఆయనకు కలిసి వస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పట్లో జగన్ రాజధానిని మారుస్తారని, అందుకే రాజధాని కమిటీని ఏర్పాటు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలు నిజమే అనుకునేలా ఏపీకి రాజధానే లేనట్లు కేంద్రం ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది. అయితే.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తాడు. దాంతో వెంటనే స్పందించిన కేంద్రం.. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మళ్లీ మ్యాప్ విడుదల చేసింది.

ఇది ఒక రకంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్‌పై పైచేయి సాధించని బాబు.. అమరావతి విషయంలో మాత్రం గెలుపొందారని చెబుతున్నారు. దీనికి తోడు నిన్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నోటి దురుసుతో అమరావతిని స్మశాన వాటికతో పోల్చారు. ఈ రెండు అనుకోని పరిణామాలతో జగన్‌పై పోరాటానికి సిద్ధమౌతున్నారు చంద్రబాబు. టీడీపీ ఇప్పటికే ట్వీట్ల దాడి ప్రారంభించింది. “ఆంధ్రులు గర్వించేలా రాష్ట్రానికి రాజధానిగా ఒక ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తామంటే… కేవలం చంద్రబాబు మీది నమ్మకంతో వేల ఎకరాలను ఇచ్చారు రాజధాని ప్రాంత రైతులు. ఈరోజు అమరావతిని స్మశానంతో పోల్చి, ఆ రైతుల త్యాగాలను అవహేళన చేసారు బొత్సగారు” అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.


ఆరు నెలల పాలనలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టమౌతుంది. ప్రస్తుతం కడప టూర్ లో ఉన్న చంద్రబాబు పర్యటన రేపటితో ముగియనుంది. చేతికి దొరికిన అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూద్దాం..
Please Read Disclaimer