కరోనాతో అంతా చస్తుంటే.. బీచ్ పార్టీలో అమెరికా యువత

0

కోవిడ్-19 వైరస్ విశ్వవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటుంటే.. అమెరికా యువత మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు నిజంగానే చిర్రెత్తుకొచ్చేలా చేస్తోందని చెప్పక తప్పదు. అమెరికాలో సోమవారం ఒక్కరోజే వెయ్యి మందికిపైగా కరోనా సోకగా… ఏకంగా 130 మంది ప్రాణాలు వదిలారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో అమెరికాకు చెందిన కొందరు యువతీ యువకులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్ లో ఏకంగా పార్టీ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అది కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించకుండానే సదరు యువత పార్టీకి సిద్దం కాగా… పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. అయినా కూడా సదరు యువత… పోలీసులనే నిలువరిస్తూ… యువతకు కరోనా ముప్పు లేదు కదా అంటూ ప్రశ్నిచారట.

కలకలం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలతో తెగ వైరల్ గా మారిపోయింది. ఈ సందర్భంగా కరోనా గురించి సదరు యువతకు వివరించే యత్నం చేయగా… ‘నాకు కరోనా వస్తే రానివ్వండి. దాని వల్ల నేను పార్టీ చేసుకోవడం విరమించుకోను’ అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడట. దీంతో సదరు మీడియా ప్రతినిధి ఖంగు తిన్నారట. అయినా ప్రపంచ దేశాలన్నీ కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ మంత్రాన్ని పాటిస్తుంటే.. అమెరికా యువత మాత్రం ఇలా పార్టీలంటూ బీచ్ లకు రావడమేమటన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… చిన్న పిల్లలు వృద్దులపైనే కరోనా ప్రభావం చూపుతుందన్న మాటలోనూ వాస్తవం లేదని తెలస్తోంది. అమెరికాలో ఇప్పటిదాకా 2500 మందికి కరోనా సోకగా.. వారిలో 20 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారని అక్కడి విశ్లేషణలు చెబుతున్నాయి. 38 శాతం మంది 20 నుంచి 54 ఏళ్లలోపు ఉన్న వారేనని కూడా ఆ నివేదికలు చెబుతున్నాయి. వాస్తవం ఇలా ఉంటే… యువకులం కదా తమనను కరోనా ఏం చేస్తుందన్న నిర్లక్ష్య భావనతో అమెరికా యువత బీచ్ లో పార్టీ కోసం సమూహంగా చేరడం నిజంగానే తీవ్ర నిర్లక్ష్యం కిందకే వస్తుందని చెప్పాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-