ఆంటీల ఫ్యాన్ అయిపోయా: ఆనంద్ మహీంద్రా

0

దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్రా తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇటీవల ముంబైలో ఓ ఆంటీ ఫుట్ పాత్ పై వెళుతున్న బైకర్లను హెచ్చరిస్తూ రోడ్డుపై వెళ్లాలని ఓ మహిళ చేసిన ప్రయత్నం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహేంద్రా హాట్ కామెంట్స్ చేశారు.

ముంబైలో రోడ్డుపై కాకుండా ఫుట్ పాత్ పై జనాలు నడిచే దానిపై నుంచి బైకర్స్ వెళ్లడం వల్ల పాదచారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఓ మహిళ టీచర్ అయిన గోఖలే ఫుట్ పాత్ పై నిలబడి ముంబైలో ఫుట్ పాత్ పై వచ్చిన బైకర్లకు బుద్ది చెప్పింది. ఈ మహిళ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబై షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. ‘ఈ వీడియోను ఇప్పుడే చూశా. వెంటనే ఆంటీలందరికీ ఫ్యాన్ అయిపోయా.. ఇటువంటి స్త్రీలు మరింత పవర్ ఫుల్ గా అవ్వాలని ఆశిస్తున్నా. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళను ఖచ్చితంగా సన్మానించాలి. ఆంటీల ప్రతిభకు గుర్తుగా ప్రపంచ ఆంటీల దినాన్ని నెలకొల్పితే ఇంకా బాగుంటుంది. ఇటువంటి వారివల్లే ప్రపంచం సురక్షితం గా ఉంటుందని ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-