ఆటోనే కదా అని వెళ్తే.. లోపల అదుర్స్

0

ఆనంద్ మహేంద్ర.. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఈయన ఆటోమోబైల్ పరిశ్రమలో పేరెన్నికగల ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో ప్రవేశపెడుతుంటారు. వింతలు విశేషాలు సాయాలపై ట్విట్టర్ లో స్పందిస్తూ వారికి విరాళాల రూపంలో సాయం కూడా చేస్తుంటారు. కొత్త కొత్త ఐడియాలో సమాజంలో వినూత్నంగా చేసే వారికి ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహేంద్ర తనకు నచ్చిన వీడియోలను ఆలోచింపజేసే కొన్ని విషయాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక ఆటో వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

అది ఒక నల్లటి ఆటోరిక్షా.. కానీ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం మీరు షాక్ అవ్వాల్సిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆ ఆటోలో ఒక హ్యాండ్ వాష్ శానిటైజర్ తోపాటు చేతులు కడుక్కోవడానికి ఒక వాష్ బేసిన్ ను కూడా ఆటోలో ఏర్పాటు చేశారు. దాని చుట్టుపక్కల ఆహ్లాదకరంగా మొక్కలు ఏర్పాటు చేశారు. కరోనా జాగ్రత్తలను ఆటోలో రాశారు. ఒక ఆటోనా.. మినీ వ్యానా అన్నట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించారు.

ఈ ఆటో వాలా స్వచ్ఛ భారత్ కు ఆనంద్ మహేంద్రా ఫిదా అయ్యి అతడిని కొనియాడుతూ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది.