ఆంధ్ర గవర్నర్ చేసిన పని తెలిస్తే శబాష్ అంటారు

0

అధికారంలో చేతిలో ఉంటే చిన్న దానికి పెద్ద దానికి అవసరం లేకపోయినా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరానికి మించి హంగు ఆర్భాటాలు చేస్తుంటారు. ఇక రాష్ట్ర ప్రధమ పౌరుడి హోదాలో వున్నా వాళ్లయితే ఏమి కావాలన్నా ఏమి చేయాలన్న చేయవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మాత్రం ప్రజాధనాన్ని ఖర్చుపెట్టే విషయంలో చాలా ఖచ్చితత్వంతో ఉన్నాడు.

తాజాగా తిరుమలలో జరుగుతున్నా బ్రహ్మోత్సవాలకి వెళ్లాలని అనుకున్నాడు, దీనితో అధికారులు ఏర్పాట్లు చేస్తూ ప్రత్యేకమైన విమానాన్ని సిద్ధం చేద్దామని చెప్పారు. ప్రత్యేకంగా విమానం ఏమి వద్దు, ఎక్కువ ఖర్చు అవుతుంది, సాధారణ విమానంలోనే వెళ్తానని చెప్పాడు. అయితే విజయవాడ నుండి తిరుపతికి నడిచే సర్వీస్ ఏమి లేదు, వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుండి వెళ్లాలని చెప్పారు.

దీనితో గవర్నర్ హైదరాబాద్ వెళ్లి అటు నుండి తిరుమల వెళ్ళాడు, అయితే అక్కడ ఎక్కువ సమయం ఉంటే అధికారులు చాలా మంది తన కోసం పనిచేస్తుంటారు, అందువలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతారని భావించి కేవలం ఒక గంట మాత్రమే కొండ మీద ఉండి, తిరిగి హైదరాబాద్ చేరుకొని అటు నుండి రాత్రికి విజయవాడ వచ్చాడు. ఆయన తలుచుకుంటే ఇంత ఇబ్బంది పడి తిరుమల వెళ్లాల్సిన పనే లేదు. ప్రత్యేక విమానం పెట్టుకుంటే ప్రజాధనం వృధా అవుతుందని భావించి ఇలా సాధారణంగా వెళ్ళివచ్చాడు.
Please Read Disclaimer