షాక్.. అంబానీ రాజీనామా.. రిలయన్స్ నుంచి బయటకు!

0

ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆఖరికి అన్నకు ఇష్టమైన కంపెనీని ఆస్తి పంపకంలో దక్కించుకొని, దానికి కూడా నిలుపుకోలేకపోయారు. ఇదంత ఎవరి గురించి అనుకుంటున్నారా? ధీరుభాయ్ Ambani కొడుకు, Mukesh Ambani తమ్ముడు అయిన అనిల్ అంబానీ గురించి.

అనిల్ అంబానీ తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ కంపెనీని రక్షించలేక ఆయన చేతులెత్తిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అనిల్ అంబానీ ఆర్‌కామ్ కంపెనీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు.

కేవలం అనిల్‌ అంబానీ మాత్రమే కాకుండా ఆయనతోపాటు నలుగురు డైరెక్టర్లు కూడా కంపెనీకి రాజీనామా చేశారు. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన రిలయన్స్ కంపెనీ నుంచి అనిల్‌ అంబానీతో పాటు ఛాయా విరాణి, రైనా కరానీ, మంజరి కకేర్‌, సురేష్‌ రంగాచారీలు డైరెక్టర్‌లుగా వైదొలిగారు.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ బీఎస్‌ఈకి ఇచ్చిన నోటీసులో ఈ అంశాన్ని తెలియజేసింది. కాగా గతంలో కంపెనీ డైరెక్టర్‌, సీఎఫ్‌ఓ వి.మణికంఠన్‌ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్‌కామ్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.30,142 కోట్లకు చేరిన విషయం తెలిసిందే.

ఇకపోతే దేశీ టెలికం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం ఆందోళన రేకిత్తిస్తోంది. ఇక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్ బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్‌ జులై-సెప్టెంబర్‌ కాలానికి ఏకంగా రూ.50,921 కోట్ల నష్టాలు ప్రకటించింది. మరో టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ కూడా రూ.23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది.
Please Read Disclaimer