జులై 16న తిరుమలలో అన్నప్రసాదం నిలిపివేత!

0

జులై 16 రాత్రి చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం తెలిసిందే. అలాగే అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జులై 16 రోజు రాత్రి 7 గంటల నుంచి 17న ఉదయం 9 గంటల వరకు అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తున్నట్టు తెలిపింది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనం, యాత్రిసదన్‌-2, వైకుంఠం-2, దేవస్థానం ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీపద్మావతి విశ్రాంతి భవనం, ఎస్వీ విశ్రాంతి భవనంలో అన్నప్రసాద వితరణ నిలిపివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే, జులై 16న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు 20 వేల పులిహోర, టమోటా రైస్‌ పొట్లాలను భక్తులకు ప్రత్యేకంగా అందజేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 16న దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల రద్దు చేసినట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.

అలాగే అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, 17న ఆణివార ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసింది. పౌర్ణమి రోజున శ్రీవారికి నిర్వహించే గరుడసేవను సైతం రద్దు చేసింది. దాదాపు 18 గంటల పాటు ప్రధాన ఆలయం మూసివేస్తున్నందున వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి భక్తులకు అనుమతించే విషయంలోనూ రద్దీని బట్టి నిర్ణయం తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. 15న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠం-2లోకి భక్తులను పరిమితంగా అనుమతించి, 16న మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య స్వామివారి దర్శనం చేయించనున్నారు. అయితే, 16న మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి యాత్రికులను అనుమతించరు. 17న ఉదయం 5 గంటల నుంచి మాత్రమే సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-