వైకాపాకు ఒక్క ఓటు పడినా భాజపాకు వేసినట్లే: చంద్రబాబు

0

వైకాపాకు ఒక్క ఓటు పడినా భాజపాకు వేసినట్లేనని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. నీతిగా ఉన్న తమపై ప్రధాని మోదీ కక్ష కట్టారని ఆరోపించారు. దేశంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో.. అన్ని కేసులూ జగన్‌పై ఉన్నాయని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నామని చెప్పారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్ష పంట కుంటలు తవ్వామన్నారు. డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు వివరించారు.

నిన్నటి వరకు ఎడారి.. నేడు ఉద్యాన పంటల కేంద్రం రాబోయే ఐదేళ్లలో ఊహించని అభివృద్ధి చేసే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. ఈ ఐదేళ్లలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 30లక్షల ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అని ప్రశ్నించారు. ”అనంతపురం జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూలు బాగా సాగు చేస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. మడకశిర, కుప్పంకు కూడా నీళ్లిచ్చాం. కరవు జిల్లాగా ఉన్న అనంతపురానికి నీళ్లు తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డాం.

నిన్నటి వరకు అనంతపురం ఎడారి.. ఇవాళ ఉద్యాన పంటల కేంద్రం. రుణమాఫీ నగదు ఏప్రిల్‌ తొలివారంలో రైతుల ఖాతాల్లో పడతాయి. ఏప్రిల్‌ 4న పసుపు-కుంకుమ నగదు తీసుకోవచ్చు” అని సీఎం చెప్పారు.
Please Read Disclaimer