ఏపీలో కూరగాయల రేట్లు ఫిక్స్.. ఎక్కువ ధరలకు అమ్మారో..

0

లాక్‌డౌన్‌ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెంచొద్దన్నారు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని. కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యావసరాలు, కూరగాయలు అధిక ధరలకు అమ్మితే వ్యాపారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం నిర్ణయించిన కూరగాయల ధరలు ఇలా.. కిలోకు రూపాయల్లో

వంకాయలు – 30
బెండకాయ – 40
టమాటా – 10
అరటికాయ – 40
కాలిఫ్లవర్ – 40
క్యాబేజీ – 23
పచ్చిమిర్చి – 60
చిక్కుడుకాయ – 45
బీరకాయ – 60
క్యారెట్ – 60
బంగాళాదుంప – 30
ఉల్లిపాయ తెల్లవి – 30
ఉల్లిపాయ ఎర్రవి – 35
వెల్లుల్లి – 160
అల్లం – 220
పాలకూర – 40
తోటకూర – 40
కొత్తిమీర – 60
మెంతికూర – 60
కందిపప్పు గ్రేడ్-1 – 95
మినపప్పు – 140
పెసరపప్పు – 105
శనగపప్పు – 65
సజ్జలు – 30
గోధుమలు – 36
జొన్నలు – 38
రాగులు – 40

ఇటు రైతు బజార్ల వికేంద్రీకరణపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలిచ్చారు. నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన ధరలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మితే 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. జనాలు గుంపులుగా రాకుండా ఉండేందుకు.. నిత్యావసర వస్తువులు, రైతు బజార్లను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి చెప్పారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-