సీఎం జగన్ ఆ రెండు ఫోటోలు మాత్రమే వాడాలి.. ఎందుకంటే!

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాల్లో, పథకాల్లో ఉపయోగించే ఫోటోలపై క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ కార్యక్రమం, ప్రకటన, ఏదైనా వార్త రాసినా అందులో తనకు సంబంధించిన రెండు ఫొటోలు మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఈ రెండు ఫోటోలు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార మాసపత్రిక కవర్ పేజీ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ప్రింట్ అయ్యింది. దీనిపై పెద్ద వివాదమే నడిచింది.. దీంతో ఆ పత్రికల ప్రచురణను నిలిపివేశారు. ప్రభుత్వం తరపున చేపట్టే కార్యక్రమాల్లో జగన్ ఫొటోలతో కూడిన బ్యానర్లను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. వీటిలో కూడా ఫోటోలను ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో లబ్దిదారులకు ఇచ్చే రేషన్ సరుకుల బస్తాలు.. ఇలా ప్రతీదానిపై ముఖ్యమంత్రి ఫోటో వేస్తుంటారు. ఈ ఫోటోలను ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తుండటంతో సీఎం కార్యాలయం స్పందించింది.. ఇకపై కేవలం రెండు ఫోటోలు మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Please Read Disclaimer