పక్క పంచితేనే పట్టా అంటున్న ఏపీ నీట్ డైరెక్టర్

0

చదువును చెప్పే కళాశాలలు దేవాయలతో సమానం. చదువుని చెప్పే గురువులు దేవుళ్లతో సమానం అంటారు. కానీ ఈ మధ్య కాలంలో మంచి విద్యని బోధించి విద్యార్థుల భవిష్యత్ కి తోడ్పడాల్సిన గురువులే తమ కోరికలు తీర్చపోతే మీరు ఎలా పాస్ అవుతారో చూస్తాం అంటూ బేధించి లొంగదీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే బయటపడ్డాయి. తాజాగా ఏపీ నీట్ లో మరో వ్యవహారం బయట పడింది. మీ పని కావాలి అంటే డబ్బులు ఇవ్వాలి లేదా లైంగిక వాంఛ తీర్చాలని ఏకంగా నిట్ డైరక్టరే వేధిస్తుండటం సంచలనంగా మారింది. గతంలో ఒకసారి ఈ నీట్ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ ..ఈసారి ఏకంగా వీడియో బయటకి వచ్చింది.

దేశంలోనే అత్యున్నత సాంకేతిక విధ్యను అందించాల్సిన నీట్ అరాచకాలకు కేంద్రంగా మారింది. దేశ కీర్తి ప్రతిష్టతలు రేరెపలాడించే ప్రతిభావంతులను తీర్చిదిద్దాల్సిన చోట కూడా విద్యార్థులకు వేధింపులు తప్పడం లేదు. ఏకంగా పీహెచ్ డీ పట్టాలతో వ్యాపారం మొదలుపెట్టారు నిట్ డైరక్టర్ సీఎస్పీ రావు. నీట్ లో పీహెచ్ డీ పట్టా తీసుకోవాలి అంటే అబ్బాయిలతే ఐదు లక్షలు అమ్మాయిలైతే లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక వీడియో బయటపడటం తో డైరెక్టర్ సీఎస్పీ రావు బండారం మొత్తం బయటపడింది. దీనితో నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడంతో పై వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారివల్ల విద్యార్థులు వేధింపులకు గురౌతున్నారని అలాగే వీరివల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తున్నారన్నారు. ఇకపోతే నిట్ డైరక్టర్ సీఎస్పీ రావు వేధింపులు కొత్తేమీ కాదని విద్యార్ధులు చెప్తున్నారు. చాలా కాలం నుండి అయన వ్యవహార శైలి ఇలాగే ఉందని కానీ బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో మరింత చెలరేగి పోయారంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-