ఢిల్లీ ప్రజలను ఫిదా చేసిన సీఎం

0

ముఖ్యమంత్రికి అయినా కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే… ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని తన నగరంలో ఇంటి ఓనర్లకు ఓ విజ్జప్తి చేశారు. కరోనా వల్ల అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. చాలామందికి దీని వల్ల ఆదాయం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఢిల్లీ రాష్ట్రంలో ఇంటి ఓనర్లకు ఉపాధి కోల్పోయిన పేదల తరఫున విజ్జప్తి చేస్తున్నాను. దయచేసి అద్దెకోసం వేధించొద్దు. బలవంతంగా వసూలు చేయొద్దు. సాటి పౌరుడిగా బాధ్యత తీసుకోండి అంటూ కేజ్రీవాల్ కోరారు.

ఇపుడు ఎవరికీ డబ్బులు పుట్టడం లేదు. మళ్లీ ఈ కరోనా అనంతరం వారు తిరిగి సంపాదించి మీ పెండింగ్ అద్దె మెల్లగా కడతారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. వారికి అద్దె ఆలస్యంగా కట్టుకునే అవకాశం ఇవ్వండి. ఇది ఒక సాటి పౌరుడిగా నా విజ్జప్తి అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇది మనందరికి మూకుమ్మడిగా వచ్చిన కష్టం. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విజ్జప్తిని చేస్తున్నాను అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

కేజ్రీావాల్ దిగువ మధ్యతరగతి – పేద ప్రజలకు తన పథకాలతో గౌరవంగా బతికే అవకాశం ఇచ్చిన వ్యక్తి. వారి స్కూళ్లను బాగు చేశారు. వారికోసం ఆస్ప్రత్రులను బాగు చేశారు. అందుకే మోడీ వంటి బలమైన వ్యక్తిని – హిందుత్వ వాదపు ఓటును అధిగమించి మూడోసారి ఢిల్లీ పీఠం ఎక్కారు. తాజా ప్రకటనతో ఆయన పేదల మనసును మరోసారి దోచుకున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-