Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఆ భంగిమల్లో శృంగారమంటూ భర్త ఒత్తిడి.. భార్య ఏం చేసిందంటే?

ఆ భంగిమల్లో శృంగారమంటూ భర్త ఒత్తిడి.. భార్య ఏం చేసిందంటే?


కొందరు వెర్రి బాగులోళ్లు ఉంటారు. ఇంకొందరు ఆధునికత కోరుకుంటారు. మరికొందరు అల్ట్రా మోడల్ గా శృంగారం చేయాలని ఉబలాటపడుతుంటారు. కొందరు పోర్న్ వీడియోలు చూస్తూ అచ్చం అలాగే చేయాలని ఒత్తిడి చేస్తారు. కానీ ఎలా చేసినా భాగస్వామి ఇష్టం లేకుండా చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. తాజాగా తాను కోరుకున్నట్టుగా అసాధారణ భంగిమల్లో శృంగారంలో పాల్గొనలేదని ఓ భార్యపై భర్త దాడి చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. గుజరాత్ లోని న్యూ మనిన్ నగర్ కు చెందిన బాధిత మహిళ కుటుంబం ఇటీవలే 20 లక్షల కట్నం ఇచ్చి ఓ వ్యక్తికి పెళ్లి చేసింది. పెళైన 15 రోజులకే ఆ భర్త ఆమెను వేధించడం ప్రారంభించాడు.

దీంతో పుట్టింటికి వెళ్లిన భార్య.. రెండు నెలల పాటు అక్కడే గడిపింది. అనంతరం భర్త వచ్చి ఇంటికి ఇటీవలే తీసుకొచ్చాడు.అయినా భర్త అత్తామామల ప్రవర్తనలో మార్పు రాలేదు. వేధించడం మరింత పెరిగింది.

రెండు నెలల తర్వాత వచ్చిన భార్యను శృంగారం చేసే సమయంలో అసాధారణ భంగిమల్లో ఉండాల్సిందిగా భర్త ఒత్తిడి చేశాడు. అవి తనకు అసౌకర్యంగా ఉంటాయని భార్య చెప్పినా భర్త వినలేదు. వద్దని వారించడంతో భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ వేధింపులు తట్టుకోలేక భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గృహ హింస కేసు పెట్టారు.