ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ కట్టిన భారత్

0

సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగమార్గం నిర్మాణాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ టన్నెల్ కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును పెట్టారు.

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ లడఖ్ లోని లేహ్ ను అనుసంధానించే ఈ టన్నెల్ చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనదిగా అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రధాని నరేంద్రమోడీ ఈ టన్నెల్ ను ప్రారంభిస్తారు.

ఈ టన్నెల్ రహదారిని ఏకంగా 4 వేల కోట్లతో నిర్మించారు. గుర్రెపు డెక్క ఆకారంలో సొరంగ మార్గాన్ని నిర్మించారు. లఢక్ లో మోహరించిన భారత సైనికులకు ఈ టన్నెల్ ఉపయోగం. అయితే మంచు కారణంగా ఈ టన్నెల్ ఐదు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2010 జూన్ 28న ఈ టన్నెల్ కు శంకుస్థాపన చేశారు. మొదటి ఆరేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా.. 10 ఏళ్లు పట్టింది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఈ టన్నెల్ ను నిర్మించారు. మనాలి-లేహ్ మధ్య దూరాన్ని 46 కి.మీలు ఈ సొరంగమార్గం తగ్గిస్తుంది. నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది.