స్టేడియంలో మంటలు.. ఫైర్ ఫైటర్ అవతారమెత్తిన మ్యాక్స్‌వెల్ (వీడియో)

0

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో అనుకోని ప్రమాదం తలెత్తింది. అయితే తెలివిగా వ్యవహరించిన ఒక క్రికెటర్ వెంటనే మంటలు ఆర్పాడు. ఈ సంఘటన జరిగింది లాంచెస్టన్ నగరంలో. మంటలను ఆర్పింది ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్‌వెల్ కావడం విశేషం. మ్యాక్సీ చేసిన పనిని వీడియో తీసిన సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ దాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. మ్యాక్సీ సాహసంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే హోబర్ట్ హారికేన్‌తో మ్యాచ్ ఆడేందుకు లాంచెస్టన్ చేరుకున్నాడు. అయితే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా స్టేడియం ముందు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే స్పందించిన మ్యాక్సీ.. ఫైర్ ఫైటర్ అవతారమెత్తి మంటలను అందుపు చేశాడు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసిన స్టెయిన్ దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. నెటిజన్లు అందరూ కామెంట్లు, లైకులతో స్పందించడంతో ఈ వీడియో వైరలైంది.

ఇక ఈ ఘటన జరిగినా కూడా మెల్‌బోర్న స్టార్స్-హారికేన్స్ మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలుగలేదు. ప్రతికూల వాతవారణం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా.. హోబర్ట్ 69/5 చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్‌ను 11 ఓవర్లలో 80 రన్స్‌కు కుదించారు. మార్కస్ స్టొయినిస్-పీటర్ హ్యాండ్స్‌కోంబ్ మూడో వికెట్‌కు 53 రన్స్ జోడించి స్టార్స్‌ను గెలిపించారు.
Please Read Disclaimer