బికినీ పెళ్లాంతో దేశదిమ్మరిలా తిరిగాడు

0

దేశాలు పట్టి తిరిగితే దేశ దిమ్మరి అంటారు. అయితే ఇతగాడి వాలకం చూస్తుంటే ఆయనొక్కడే తిరగడు. తనతో పాటే వైఫ్ ని కూడా ఊరూ వాడా తిప్పేస్తుంటాడు. దేశ విదేశాల్ని చుట్టి రావడమే ఈయన గారి ఎజెండా. పైగా తన వెంటే బికినీ బేబ్ లాంటి వైఫ్ సరాగాల పల్లకిలో ఊరేగుతుంటే రాజీ అన్నదే లేకుండా షికార్లు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరీయన అంటే..

పేరు జాన్ హాస్టింగ్స్. ఆయన ఆస్ట్రేలియన్ క్రికెటర్. తను బ్రయానా అనే సూపర్ స్టార్ ని పెళ్లాడాడు. ఇంకేం ఉంది ఆ ఇద్దరి ఆదాయాలకు కొదవేం లేదు. అంతా వచ్చి పడేదే. అందుకే ప్రపంచయాత్రల పేరుతో దేశాలు పట్టి తిరగడమే వీళ్ల పని. ఇప్పటికే 11 దేశాల్లో 8 డిఫరెంట్ ఐల్యాండ్స్ చుట్టొచ్చారు. అందుకోసం 14 విమానాలు.. 17 రైళ్లు ఎక్కారు. 66 రోజుల పాటు నిరంతర పర్యటనతో క్షణం తీరిక లేకుండా తిరిగేసారట.

ఇలా వెళ్లిన ప్రతి ద్వీపంలోనూ సముద్రంలో జలకాలాటలు.. రెస్టారెంట్ డిన్నర్ లు వగైరా వగైరా చిలౌట్ ని పోటోల రూపంలో రివీల్ చేశాడు సదరు క్రికెటర్. హాట్ వైఫ్ తో టింగు రంగడిలా తిరిగేస్తున్న ఇతగాడి క్రేజీ షికార్లు చూస్తుంటే యూత్ కి కన్ను కుట్టేస్తోంది. తమకు ఇంతటి భాగ్యం కలలోనైనా కలగనందుకు జెలసీ ఫీలవుతున్నారంతే. ప్రస్తుతం ఈ జంట షికార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.
Please Read Disclaimer