ఆకాశవీధిలో అద్భుతం దృశ్యం.. ఏడు గ్రహాలు ఓకే చోటకు

0

ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కారం కాబోతోంది. విశ్వంలోని ఏడు గ్రహాలు ఒకేచోట దర్శనమివ్వబోతున్నాయి. నవంబర్ మొదటి వారంలోని రాత్రి మొత్తం ఈ దృశ్యాలను ఆకాశవీధిలో మనం వీక్షించవచ్చు. ఏడు గ్రహాలు ఓకేసారి కనిపించడం చాలా అరుదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యాస్తమం నుంచి సూర్యోదయం వరకూ ఆకాశంలో ఈ అరుదైన దృశ్యాలను వీక్షించవచ్చు. గురు శని గ్రహాలు చాలా సమీపంగా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యునికి మరింత దగ్గరగా రావడంతో అంగారక గ్రహం వేడితో రగిలిపోనుంది.

అక్టోబర్ 13నుంచి కాస్త అంగారక గ్రహం అస్పష్టంగానే కనిపిస్తుంది. ఇప్పుడు కాంతి నేరుగా పడే అవకాశం ఉండటంతో మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నది. శుక్రగ్రహం మాత్రం సూర్యుడికి చంద్రుడికి వెనుక వైపుకు చేరనున్నాడు. యురేనస్ నెప్ట్యూన్ కూడా కనిపించే రేంజ్ లో ఉన్నా మానవ కంటికి మాత్రం కనిపించదు. బైనాక్యులర్ లో లేదా టెలిస్కోప్ లో అది వీక్షించగలం. శని గ్రహాన్ని మాత్రం అర్ధరాత్రి తర్వాత కొద్ది గంటలకే కనిపిస్తుంది. 1.7బిలియన్ మైల్స్ దూరంలో యురేనస్ కంటికి కనిపించేంత కాకపోయినా పాక్షికంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏడు గ్రహాలు ఒకేచోట దర్శనమివ్వబోతుండటంతో ఆ దృశ్యాన్ని చూడటానికి జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.