ఆ రెండు రాష్ట్రాలలో ఓడితే బీజేపీ పని అయిపోయినట్టేనా…?

0

భారతీయ జనతా పార్టీ ..వరుసగా రెండు ధపాలుగా కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకొని దేశంలో తిరుగులేని పార్టీగా ప్రజలచే జేజేలు కొట్టించుకుంటుంది. 2014 ఎన్నికలకి ముందు బీజేపీ ప్రభావం అంతగా లేదు. కానీ మోడీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత బీజేపీ సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగి ..అప్పటివరకు ఇక చక్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతున్న నేషనల్ కాంగ్రెస్ కి ముచ్చెమటలు పట్టించి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇక అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్నో సంచలనమైన నిర్ణయాలతో మోడీ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు. అలాగే మోడీ కి తోడు తనదైన వ్యూహాలతో పార్టీ ని అగ్రపథంలో నిలబెట్టిన మరో బీజేపీ కీలకనేత ..మాజీ బీజేపీ అధినేత అమిత్ షా. ఒక్కసారి అమిత్ షా వ్యూహం పన్నాడు అంటే ..సునామీ వచ్చినా కూడా పార్టీ విజయతీరాలకు చేరాల్సిందే. ఈ ఇద్దరి జ్యోడి 2014 ఎన్నికల తరువాత ఒక్కొక్క రాష్ట్రం పై ఫోకస్ పెట్టి ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలలో పాగా వేసింది. అదే ఊపు తో 2019 లో స్పష్టమైన మెజారిటీ తో ఎవరి సహాయం అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అలా రెండోసారి కూడా కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ..పార్లమెంట్ ఉభయసభలలో తన పూర్తి మెజారిటీని ఉపయోగించుకొని కీలకమైన బిల్లుల్ని ఆమోదింపజేసుకొని తిరుగులేదు అని నిరూపించింది. కానీ ఆ తరువాత బీజేపీ కి కాలం అంతగా కలిసిరావడంలేదు అని చెప్పాలి. గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించిందిలేదు. ముఖ్యంగా మహారాష్ట్ర లో జరిగిన రాజకీయ చతుర్ముఖం గురించి అందరికి తెలిసిందే. సరైన మెజారిటీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ..భంగపాటుకు గురైంది. శివసేన తో పొత్తుతో బరిలోకి దిగినప్పటికీ ..సీఎం కుర్చీకోసం పట్టువిడవకపోవడం తో మహారాష్ట్ర కూడా బీజేపీ చేతిలో నుండి జారిపోయింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లలో అప్ బీజేపీ మధ్య పోటా పోటీ వాతావరణం ఉంటుంది అని అనుకున్నారు కానీ ఇక్కడ కూడా అమిత్ షా వ్యూహం బెడిసికొట్టింది అని చెప్పాలి. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ లో బీజేపీ కేవలం 12 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలిచినప్పటికీ కూడా కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేపీ ..దేశ రాజధాని ఢిల్లీ పీఠం పై కమలం జెండా ఎగురవేయాలన్న కల మాత్రం నెరవేరలేదు. ఎన్నికల పోలింగ్ తరువాత కూడా బీజేపీ దే విజయం అంటూ ఊదరగొట్టిన బీజేపీ నేతలు ..ఫలితాల తరువాత సైడ్ అయ్యారు. ఈ విదంగా చూసుకుంటే మొత్తంగా బీజేపీ ప్రభావం మెల్లిమెల్లిగా కోల్పోతోందా అని అనిపించకమానదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..మరో ఏడాదిలోనే బీహార్ – పంజాబ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలలో కూడా ఇదే సీన్ కనుక రిపీట్ అయితే బీజేపీ చాపచుట్టేసే టైం దగ్గరపడినట్టే ..అయితే ఆ రెండు రాష్ట్రాల రాజకీయాన్ని ఒకసారి చూస్తే అక్కడ బీజేపీ గెలవడం దాదాపుగా అసాధ్యం అని కొందరు రాజకీయ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో బీజేపీ తన ప్రభావం కోల్పోతూ వస్తే వచ్చే 2024 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం గగనమే..నేషనల్ కాంగ్రెస్ పరిస్థితి అతి త్వరలో బీజేపీకి కూడా రాబోతోంది అని కొంతమంది రాజకీయ ప్రముఖులు జోస్యం చెప్తున్నారు.
Please Read Disclaimer