ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో విషాదం

0

బీజేపీ సీఎం రమేష్ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. రమేష్ సోదరుడు ప్రకాష్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి. ప్రకాష్ నాయుడు సీఎం రమేష్‌తో పాటూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రకాష్ మృతికి పలువురు నేతలు సంతాపాన్ని తెలియజేశారు.

సీఎం రమేష్‌ కుటంబంలో ఇది రెండో విషాదం. ఆయన మేనల్లుడు ధర్మారామ్ ఏప్రిల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని అపార్ట్‌మెంట్ ఏడో ఫ్లోర్‌పైకి ఎక్కి దూకేశాడు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ధర్మారామ్ నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్‌ ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Please Read Disclaimer