ప్రాణం తీసే బీరు బాటిల్స్..కఠిన వాస్తవం చెప్పిన కొత్త పరిశోధన!

0

మీకు డ్రింక్ చేసే అలవాటుందా? అయితే.. ఇది మీకోసమే. బీర్.. వైన్.. బ్రాండ్ ఏదైనా కావొచ్చు. బాటిల్స్ లో ఉండే మద్యాన్ని నేరుగా తాగేసే వారి ప్రాణాలకు ముప్పు ఉందన్న షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. సీసాల్లోని మద్యం.. బీరును నేరుగా తాగేసే వారికి అందులో ఉండే విష పదార్థాలు ప్రాణాలు తీస్తాయన్న కఠిన వాస్తవాన్ని కొత్త పరిశోధన ఒకటి బయటపెట్టింది.

మద్యం సీసాల్లో కాడ్మియం.. లెడ్ లాంటి విష పదార్థాలు ఉంటాయని బ్రిటన్ లోని ప్లైమౌత్ వర్సిటీ ఒకటి బయటపెట్టింది. మార్కెల్లో దొరికే బాటిళ్లలో విష పదార్థాలకు అవకాశం ఉందని పేర్కొంది. మద్యం బాటిళ్లు వివిధ రంగుల్లో ఉండటం తెలిసిందే. అయితే.. బాటిళ్లు.. బాటిళ్ల మీద అంటించే స్టిక్కర్లను విశ్లేషించగా.. అందులో లెడ్.. కాడ్మియం ప్రమాదకర స్థాయిల్లో ఉన్న విషయాన్ని గుర్తించారు.

ఏడాది వ్యవధిలో వివిధ షాపుల్లో నుంచి సీసాలను సేకరించి.. ఎక్స్ రే ఫ్లోరోసెన్స్.. స్పెక్టోమెట్రీతో విశ్లేషించారట. ఈ సందర్భంగా వారు పరిశీలించిన బాటిళ్లలో 76 వాతం బాటిళ్లలో లెడ్.. 55 శాతం సీసాల్లో కాడ్మియం స్థాయికి మించి ఉన్నట్లు తేల్చారు. ముఖ్యంగా ఆకుపచ్చ సీసారంగులో ఉన్న మద్యం బాటిళ్లలో ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించారు. మద్యం బాటిళ్లను రీసైక్లింగ్ మెటీరియల్ ద్వారా తయారు చేసి ఉంటే.. ఈ ముప్పు మరింత ఎక్కువన్న విషయాన్ని గుర్తించారు. ఈ నివేదిక నేపథ్యంలో డ్రింక్ చేసే వారంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Please Read Disclaimer