గూగుల్ కక్కుర్తికి మరో ఆధారం దొరికింది

0

ఇవాళ.. రేపటి రోజున గూగుల్ గురించి తెలీనోళ్లు.. దాని సాయం లేకుండా రోజు పూర్తి చేసేటోళ్లు లేరనే చెప్పాలి. మొదట్లో సెర్చ్ కోసం.. ఆ తర్వాత మ్యాప్స్.. ఇప్పుడు యాప్ లతో నిత్యం గూగుల్ నమ: అంటూ సోత్త్రం చేసే వరకూ పరిస్థితి వచ్చింది. స్మార్ట్ ఫోన్లు మొత్తం ఆండ్రాయిడ్ మయం కావటంతో గూగుల్ మీద ఆధారపడటం మరింత పెరిగింది.

వందల కోట్ల మంది వాడే స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేసేవే ఎక్కువ. మరి.. ఈ ఫోన్లను ఉపయోగించి చేసే ప్రతి సెర్చ్ కు సంబంధించిన వివరాలు నమోదవుతాయి. ఎవరికి వారు వాడే ప్రతి అంశానికి సంబంధించిన వివరాలు గూగుల్ కు తెలిసిపోతుంటాయి. ఇందులో వినియోగదారుడి పేరు.. అడ్రస్.. వారి వయసు.. ఫోటోలు.. ఇలా అన్ని వివరాలు తెలిసిపోతుంటాయి.

మరి.. తమ వద్ద ఉన్న భారీ డేటాను గూగుల్ ఏం చేస్తుందన్నదే ఇప్పుడు అసలు వివాదంగా చెప్పాలి. తనకు లభించే డేటాను.. యూజర్ల వ్యక్తిగత వివరాల్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటుందన్నది ఎప్పటి నుంచో ఆ కంపెనీ మీద ఉన్న ఆరోపణ. అయితే.. దీనికి సంబంధించిన వివరాలు కొన్ని బయటకు వచ్చినా.. మొత్తంగా మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక సంచలన విషయాల్ని వెల్లడించింది ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్.

బ్రౌజర్ మేకర్ బ్రేవ్ ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న కమిషన్ విచారణను చేపట్టింది. దీని ప్రకారం వినియోగదారుల డేటాకు సంబంధించిన సమాచారాన్ని హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా అడ్వర్టైజర్లతో పంచుకుంటుందన్న విషయాన్ని బయటపెట్టింది. యూనియన్ ప్రైవసీ రెగ్యులేషన్స్ కళ్లుగప్పి హిడెన్ పేజేస్ ద్వారా రహస్యంగా యూజర్ల ప్రైవసీ సమాచారాన్ని గూగుల్ పలువురు అడ్వర్టైజర్లకు అందిస్తుందన్న విషయాన్ని గుర్తించింది. మరి.. దీనిపై గూగుల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి గూగుల్ మనం అనుకున్నంత సుద్దపూస కాదు.. పెద్ద ముదురు కేసే అన్న మాట.
Please Read Disclaimer