బ్రేకింగ్: స్పీకర్ కు ఆరునెలల జైలు శిక్ష

0

ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్లు కాసింత ఓపిక సహనంతో ఉండాలి. లేకుంటే చిక్కులు తప్పవు. తాజాగా శాసనసభ స్పీకర్ గా అత్యున్నత పదవిలో ఉన్న నేత కోర్టు ముందు తేలిపోయాడు.. ఆయన చేసిన పనులకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది.

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ చిక్కుల్లో పడ్డారు. 2015 ఫిబ్రవరి 6న స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ పాత పగలను దృష్టిలో పెట్టుకొని తన అనుచరులతో కలిసి ఢిల్లీకి చెందిన బిల్డర్ మనీష్ ఘాయ్ ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశాడు. ఆయన ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేయడంతోపాటు అడ్డొచ్చిన పని మనుషులపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడి ఘటనలో స్పీకర్ రామ్ నివాస్ పై బిల్డర్ మనీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్ నివాస్ తోపాటు మరో నలుగురు సుమిత్ గోయల్ హితేష్ ఖన్నా అతుల్ గుప్తా బల్బీర్ సింగ్ లను తాజాగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు దోషులుగా తేల్చింది. స్పీకర్ రామ్ నివాస్ తోపాటు అతడి కుమారుడు సుమిత్ గోయల్ కు ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించింది.

అయితే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది. లక్ష రూపాయల బాండ్ పై బెయిల్ మంజూరు చేసింది.
Please Read Disclaimer