బీజేపీ సీనియర్ నేత కన్నుమూత

0

బీజేపీలో సీనియర్ నేతల మరణం కలవరపరుస్తోంది. గత సంవత్సరం వాజ్ పేయి.. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేతలు మాజీ కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీల మరణం మరిచిపోకముందే బీజేపీలో మరో విషాదం నెలకొంది.

కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ (82) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. జశ్వంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు.

1938లో రాజస్థాన్ లో జన్మించిన జశ్వంత్ సింగ్.. 1980 నుంచి వరుసగా 5 సార్లు రాజ్యసభకు.. 4 సార్లు లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.

వాజ్ పేయి హయాంలో జశ్వంత్ సింగ్ ఆర్థిక విదేశాంగ రక్షణ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేశారు.