శవపేటికలో పడుకుని పెళ్లికి వచ్చిన వధువు.. షాకైన అతిథులు

0

వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదే కాబోలు. చక్కగా పూలతో అలంకరించిన కారులోనో, రథం మీదో రావల్సిన వధువు శవ పేటికలో పడుకుని పెళ్లి మండపం వద్దకు వచ్చింది. పెళ్లిలోకి శవ పేటికను తెస్తున్నారంటని ఆశ్చర్యపోయిన అతిథులు.. అందులో నుంచి పెళ్లి కూతురు నవ్వుతూ దిగడాన్ని చూసి అవ్వక్కయ్యారు.

ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలీదు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. పెళ్లి కూతురును పెళ్లి వేదిక వద్దకు తీసుకొచ్చే ముందు.. ఆమెను శవ పేటికలో ఉంచారు. అనంతరం దానిపై నల్లని వస్త్రాన్ని పరిచారు. కొద్ది సేపటి తర్వాత వధువరుల కేరింతల మధ్య ఆ నల్ల వస్త్రాన్ని తొలగించారు. అనంతరం పెళ్లి కూతురు ఆ శవ పేటిక నుంచి బయటకు వచ్చింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

ఇటీవల యూకేలో కూడా ఓ భిన్నమైన వివాహం జరిగింది. వరుడు పెళ్లి కుమార్తె దుస్తులను వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వేడుకలో పెళ్లి కుమార్తు వరుడి దుస్తుల్లో మెరిసింది. ఈ జంపలకిడి పంబ పెళ్లి కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్నెట్ యుగంలో వైరలయ్యేందుకు చాలామంది ఇలా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ, మరీ ఇలా శవ పేటికలో పెళ్లికి రావడం అంటే కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. అంటే.. పెళ్లి తర్వాత ఇక లైఫ్ ‘అంతే’ అని సింబాలిక్‌గా చెప్పేందుకు ఇలా చేసి ఉంటారా? ఈ పెళ్లిపై మీరు ఏమంటారు?
Please Read Disclaimer