సరిహద్దులో కూలిన వంతెన: ప్రజల రాకపోకలకు ఆటంకం

0

అకస్మాత్తుగా భారత్- చైనా సరిహద్దులో ఉన్న ఓ వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వాహనం భారీ నిర్మాణ యంత్రాన్ని బ్రిడ్జ్ పైనుంచి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లిలాం జోహార్ లోయలోని మున్సారీ తహసీల్ వద్ద ఉన్న ధపా మిలాం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.మిలాం నుంచి చైనా సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం భారీ యంత్రాన్ని అక్కడకు తీసుకెళ్తున్నారు. ఈ వంతెన కూలిపోవడంతో స్థానిక ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని 7000 మందికిపైగా ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి.ఈ వంతెన కూలడంతో భారత సైన్యానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు వచ్చి పడ్డాయి. ఆర్మీ ఐటీబీపీ దళాల ప్రయాణాలకూ విఘాతం కలిగింది.

ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. ఈ సమయంలో వంతెన కూలడంతో భారత్ సైనిక కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా మారింది. స్పందించిన ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
Please Read Disclaimer