కారులో డబ్బు కట్టలు .. పోలిసుల విచారణలో ఆసక్తికర నిజాలు !

0

కడప జిల్లా బద్వేల్ సమీపంలో భారీగా డబ్బు పట్టుబడింది. గోపవరం మండలం పీ.పీ కుంట చెక్ పోస్టు దగ్గర బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ కారుని అపి తనిఖీ చేయగా అందులో భారీగా నగదు ఉంది. కర్ణాటక నుంచి నెల్లూరు వెళ్తున్న కారులో రూ.1.05 కోట్ల నగదు పట్టుబడింది. అయితే పట్టుబడిన నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ డబ్బు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారో పోలీసులు ఆరా తీశారు. విచారణ అనంతరం కర్ణాటక దావణగిరె ప్రాంతానికి చెందిన కారులో తరలిస్తున్న రూ.1.05 కోట్లు నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు శివమొగ్గకు చెందిన వక్కల వ్యాపారం చేసే యజమాని నాగేంద్రకు చెందినదిగా గుర్తించారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లొ రావాల్సిన బకాయిలను వసూళ్లు చేసుకుని నెల్లూరులో గ్రానైట్ కోసం అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్తునట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగదును తిరుపతి అదాయపు పన్ను అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం పంపినట్టు పోలీసులు తెలిపారు.