రూ.25000 ఇన్వెస్ట్‌మెంట్‌తో నెలకు రూ.లక్షకు పైగా సంపాదించొచ్చు.. మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా..!

0

డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? ఉద్యోగం చేస్తే వచ్చే జీతం నెల వారీ ఖర్చులకు, ఈఎంఐలకే సరిపోతుంది. మరి అదిరిపోయే రాబడి కావాలంటే ఏం చేయాలి? కచ్చితంగా బిజినెస్ చేయాల్సిందే. అయితే బిజినెస్ చేసే ముందు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది.

ఏ బిజినెస్ చేయాలి?

మంచి రాబడి అందించే బిజినెస్ స్టార్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. మీరు కూడా ఈ జాబితాలో ఉంటే పోహా తయారీ బిజినెస్‌ ప్రారంభించండి. దీంతో మంచి ఆదాయం పొందొచ్చు. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాపారం చేయడానికి రుణ సదుపాయం కూడా లభిస్తుంది.

పోహా తయారీ

పోహా మంచి పోషకాహారమని చెప్పుకోవచ్చు. చాలా మంది పోహాను స్నాక్స్ రూపంలో తింటూ ఉంటారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా సులభంగానే జీర్ణమౌతుంది.

డిమాండ్ ఫుల్

పోహాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో పోషకాహారాలు ఎక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. అందుకే పోహా మార్కెట్ విస్తరిస్తూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మీరు పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ఆదాయం పొందొచ్చు.

90 శాతం వరకు లోన్

మీరు పోహా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే.. కేంద్ర ప్రభుత్వం మీకు రుణ సదుపాయం అందిస్తోంది. మీకు అయ్యే ఖర్చులో 90 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో తీసుకోవచ్చు.

తయారీ యూనిట్ ఖర్చు రూ.2.4 లక్షలు

పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే.. మీకు దాదాపు రూ.2.43 లక్షలు ఖర్చు అవుతాయి. ఖాది విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిపోర్ట్‌ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది.

తయారీ యూనిట్ ఇలా

ఖాది విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రకారం.. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాంటు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీని కోసం మీరు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టాలి. అలాగే మరో రూ.లక్షతో పోహా మెషీన్‌, ప్యాకింగ్ మెషీన్, డ్రమ్ వంటి వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది.

మరో రూ.6 లక్షలు

ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత పోహా తయారీకి మీకు కావాల్సింది ముడిపదార్ధాలు. దీనికి మీరు రూ.6 లక్షల వరకు పెట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా ఇతరత్రా వాటికి మీకు రూ.50 వేల వరకు అదనంగా ఖర్చు అవుతుంది.

నెలకు 1000 క్వింటాల్ పోహా

మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రెడీ అయిన తర్వాత నెలకు 1000 క్వింటాల్ పోహా తయారు చేయొచ్చు. దీంతో మీకు తయారీ ఖర్చు రూ.8.6 లక్షలు అవుతుంది. మీరు 1000 క్వింటాల్ పోహాను రూ.10 లక్షలకు విక్రయించొచ్చు. అంటే మీకు రూ.1.4 లక్షల వరకు మిగులుతుంది.

లోన్ కోసం ఇలా

మీరు పోహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తే.. విలేజ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. 90 శాతం వరకు రుణం వస్తుంది. అంటే నికరంగా చూస్తే రూ.25 వేలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఖాది విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రతి ఏడాది గ్రామీణ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి రుణాలు అందిస్తూ ఉంటుంది.
Please Read Disclaimer