సీబీఎస్ఈ పరీక్షలు రద్దు

0

కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా జరిగే సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు అయిపోయాయి. జూలై 1 నుంచి 15వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ షెడ్యూల్ ప్రకటించింది. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పేర్కొంది.

సుప్రీం కోర్టులో ఈ పరీక్షల నిర్వహణపై విచారణ సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించింది. 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. పరీక్షలు నిర్వహించాలా? ఇంటర్నల్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకుంటారా అని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చారు. కోరుకున్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. దీన్ని బట్టి సీబీఎస్ఈ ఫలితాలను జూలై 15న వెల్లడిస్తారు.

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షలు రద్దు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేశారు. తాజాగా వాటిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Please Read Disclaimer