ప్రజలకు 1.7లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన మోడీ సర్కార్

0

కరోనా వైరస్ తో దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో వలస జీవులు – కూలీలు – ఉద్యోగులు – మహిళలు పనిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలను ఆదుకునేందుకు మోడీ సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా గురువారం మధ్యాహ్నం 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని దేశ ప్రజలకు ప్రకటించారు. ఈ ప్యాకేజీతో ఎవరూ ఆకలితో అలమంటించ వద్దని.. ఎవరి చేతిలోనూ డబ్బులేని పరిస్థితి ఉండవద్దని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్యాకేజీతో పేదల ఆకలి తీర్చడం.. వారి ఖాతాల్లో ప్రత్యక్షంగా కొంత డబ్బును జమ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.

ఇక కరోనాతో ప్రత్యక్ష యుద్ధం చేస్తూ బాధితులకు నయం చేస్తున్న డాక్టర్లు – నర్సులు – పారామెడికల్ స్టాఫ్ – ఆశా వర్కర్స్ – శానిటైజేషన్ వర్కర్స్ కోసం రూ.50లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ అందించబోతున్నట్టు ప్రకటించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద వచ్చే మూడు నెలల పాటు 80కోట్ల పేదలకు ఉచిత రేషన్ అందించనున్నట్టు తెలిపారు. ప్రతీ నెల ఒక్కొక్కరికి 10 కేజీలు ఇస్తామని తెలిపారు. రైతులకు కిసాన్ పథకం లో రూ.2వేలను వారి ఖాతాల్లో వేయనున్నట్టు వివరించారు.

ఇక జన్ ధన్ ఖాతాలు కలిగిన 20 కోట్ల మంది మహిళలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు జమచేస్తామన్నారు. వృద్దులు – వికలాంగులు – దివ్యాంగులకు ప్రతీనెల ఎక్స్ గ్రేషియా కింద రూ.1000 చెల్లించనున్నట్టు తెలిపారు. తద్వారా రూ.3 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు.

ఇక ఉద్యోగి – ఉద్యోగ సంస్థ తరుఫున 24శాతం పీఎఫ్ డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు తీపి కబురును అందించారు. అయితే 15వేల కంటే తక్కువ ఉన్న వారికే ఇది వర్తిస్తుందన్నారు.

ఇక కరోనా వైరస్ తో ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగులు 75శాతం పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునేలా నిబంధనలు సవరిస్తున్నట్టు తెలిపారు. ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు 31వేల కోట్ల నిధులను కేటాయించామని వారిని ఆదుకుంటామన్నారు. ఉజ్వల పథకం కింద రాబోయే 3 నెలల పాటు మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్టు తెలిపారు.

ఆర్థికమంత్రి ప్రకటించిన భారీ ప్యాకేజీలోని కీలక అంశాలివే..

% కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం

% ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం

% కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులకు 50 లక్షల ఆరోగ్య భీమా

% 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్ యోజన్ ద్వారా

% మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం

% కేజీ పప్పు సరఫరా

% పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ

% పీఎం కిసాన్ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నాం

% మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ

% ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు

% వితంతువులు – వికలాంగులు – వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి

% జన్ ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు

% ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు

% డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు

% డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు

% ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది

% 90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు

% తమ పీఎఫ్ డబ్బు నుంచి 75శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం

% భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయింపు

% రాష్ట్రాలకు కేటాయించిన మినరల్ ఫండ్ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-