బోండా ఉమకు చంద్రబాబు మార్కు ఝలక్?

0

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పట్ల వీర విధేయతను కనబరిచే వాళ్లలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అయితే బోండా బాగా హడావుడి చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వీరావేశాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీలో బోండా బూతుపురాణం అప్పట్లో చర్చనీయాంశంగా నిలిచింది. ‘చంపేస్తా.. పాతేస్తా.. నా కొడకా..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బోండా రెచ్చిపోయారు.

ఇక గత ఐదేళ్లలో బోండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు బోండా ఉమ కూడా ఓడిపోయారు. అదలా ఉంటే.. బోండా తెలుగుదేశం పార్టీలో ఉంటారా? ఉండరా? అనేది అనుమానంగానే ఉంది. ఈ అనుమానం మరెవరికో కాదట చంద్రబాబు నాయుడుకే కలిగిందని సమాచారం. అందుకే బోండా మీద చంద్రబాబు నాయుడు ఒక కన్నేశారట.

విజయవాడ సెంట్రల్లో బోండా ఉమ తెలుగుదేశం పార్టీని వీడితే అక్కడ ప్రత్యామ్నాయంగా ఎవరు? అనే అంశం గురించి చంద్రబాబు నాయుడు వాకబు చేయించినట్టుగా సమాచారం. ఈ మేరకు సెంట్రల్ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఫోన్లు వెళ్లాయట. ఈ విషయంల అటు తిరిగి ఇటు తిరిగి బోండా వద్దకే వచ్చి ఆగినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై చంద్రబాబునే అడిగారట బోండా.

తన నియోజకవర్గానికి వెళ్లిన కాల్స్ గురించి చంద్రబాబునే కలిసి వివరణ అడిగాడట బోండా ఉమ. అయితే చంద్రబాబు తనకు తెలియకుండా అవి జరిగాయని అలాంటివి జరగని బోండాకు ధైర్యం చెప్పారట!