కాఫీ షాపులో చంద్రబాబు!

0

ఆ మధ్యన చిత్తూరు నుంచి వచ్చిన చంద్రబాబు అభిమాని ఒకరు ’’బాబుకు లంచ్ బాక్స్‘‘ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపోయి ఇదేంటి అని నవ్వుతూ అడిగారు… మీరు సమయానికి భోజనం చేయండి సార్‘‘ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారా వ్యక్తి. ఒక్కొక్కరి పని విధానం ఒక్కోలా ఉంటోంది. వైఎస్ – కేసీఆర్ రిలాక్స్ గా పనిచేస్తే… చంద్రబాబు 18 గంటలు పనిచేయడానికి ఇష్టపడతారు. ఫలితాలు ఇక్కడ చర్చనీయాంశం కాదు. జస్ట్ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది. ప్రతిపక్షంలోకి వచ్చినా ఏవో మీటింగులు పెట్టుకుని చంద్రబాబు బిజీగా గడుపుతుంటారు. మొన్నామధ్యన చిన్న విదేశీ టూర్ వెళ్తే… రాజ్యసభ ఎంపీలు పార్టీ మారడంతో ఆ టూరు నిష్ఫలం అయ్యింది. తాజాగా చంద్రబాబు అమెరికా టూరులో ఉన్నారు.

మెడికల్ చెకప్స్ చేయించుకోవడంతో పాటు సరదాగా కుటుంబంతో కూడా గడిపారు చంద్రబాబు. అలా ఓ సందర్భంలో కాఫీ షాపులతో సరదాగా అర్థాంగి భువనేశ్వరితో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుండగా… బాబును గుర్తుపట్టిన వారు ఎవరో ఒ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. చంద్రబాబును ఇలా రిలాక్స్ గా చూడటం అరుదేే. చీర్స్ బాబు గారు… చిల్ సమ్ టైం!
Please Read Disclaimer