‘ఆ రూ.18లక్షలు ఏమయ్యాయి.. జగన్ సర్కార్ చెప్పాలి’

0

వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ట్విట్టర్ వేదికగా కొత్త ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరత, తెలుగు భాషా దినోత్సవ వేడుకలపై చంద్రబాబు స్పందించారు. తెలుగు భాషా దినోత్సవ వేడుకల కోసం కేటాయించిన రూ.18లక్షలు ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల కూడా వెయ్యరా అంటూ మండిపడ్డారు.

‘తెలుగు భాషా దినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కూడా లేరంటే, ఈ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. తెలుగు భాషాదినోత్సవానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 లక్షలతో ఏం చేసినట్టు?’అంటూ జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు.

‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు..” అంటూ ఆంధ్రులు గర్వంగా పాడుకునే రాష్ట్ర గీతం… ఈ మూడు నెలల్లో ఒక్క అధికారిక కార్యక్రమంలో అయినా వినిపించిందా? ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యం?’అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు చంద్రబాబు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home