ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయ్యింది. ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన తర్వాత ఈ ఆరు నెలల పాలనలో నవరత్నాలతో పాటూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు జగన్. సరికొత్త, సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఇవాళ్టితో ఆరు నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎంకు వైఎస్సార్సీపీ నేతలు అభినందనలు తెలిపారు.
ఇటు జగన్ ఆరు నెలల పాలనపై ప్రతిపక్షం టీడీపీ కూడా స్పందించింది. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్ పాలన సరిగా లేదని.. అంతా అప్పులు చేస్తున్నారని.. పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలంటూ చురకలంటించారు.
6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది?(1/2)#6MonthsFailedCMJagan pic.twitter.com/bQGZLUKVrh
— N Chandrababu Naidu (@ncbn) November 30, 2019
6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం అన్నారు చంద్రబాబు. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు అని మండిపడ్డారు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి తననే ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలని.. అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అంటూ ప్రశ్నించారు.
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న @ysjagan గారు రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. విధ్వంసంతో ప్రారంభం అయిన వైకాపా ఆరు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చారు. (1/2)#6MonthsFailedCMJagan
— Lokesh Nara (@naralokesh) November 30, 2019
ఇటు మాజీ మంత్రి నారా లోకేష్ కూడా జగన్ ఆరు నెలల పాలనపై స్పందించారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. విధ్వంసంతో ప్రారంభం అయిన వైకాపా ఆరు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చారన్నారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తా అన్న జగన్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాట మార్చి ప్రజల నెత్తిన నవరత్న తైలం రాసారు అంటూ ఘాటు ట్వీట్లు చేశారు.
Please Read Disclaimer