అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దుర్మరణం

0

దేశం ఏదైనా కానీ రోడ్డు ప్రమాదాలు జరిగే తీరు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. తాజా ఉదంతాన్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. తన దారిన తాను వెళుతున్నా.. అవతలోడి తప్పునకు జీవితాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చిన దురదృష్టకర సంఘటనగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి అమెరికాలోని మిచిగన్ లోని లాన్ సింగ్ లో నివసిస్తున్నారు.

పాతికేళ్ల ఆమె ఐటీ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. తాజాగా ఆమె టయోటా కామ్రీ కారులో ప్రయాణిస్తున్నారు. వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టిన కారుతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ఈ ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ఆమె నడుపుతున్న కారు పప్పు అయిపోయిన దుస్థితి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. చరితారెడ్డి తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.

చరితా రెడ్డి కారును ఢీ కొట్టిన కారు డ్రైవర్ మద్యం సేవించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. త్వరలోనే చరితారెడ్డి డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. తన తప్పేమీ లేకున్నా.. అవతలోడు చేసిన తప్పునకు చరితారెడ్డి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.
Please Read Disclaimer