ఆలయంలో కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి..?

0

ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి .. అయన కనుసన్నల్లో క్షణాల వ్యవధిలో ఏదైనా జరిగిపోతుంది. కానీ అయన కూడా ఒక సాధారణ మనిషే అని నిరూపించుకున్నాడు.సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలని పాటించడం మనం చూసే ఉంటాం. అలాగే ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి కూడా తాజాగా ఒక గుడికి దర్శనానికి వెళ్లి అక్కడి ఆచారం ప్రకారం ఆలయ పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ సోమవారం గోవర్థన పూజ సందర్భంగా రాయ్ పూర్ లోని దుర్గ్ లో ఓ ఆలయాన్ని సీఎం భూపేష్ భగల్ సందర్శించారు. ఆ ఆలయం లో గోవర్ధన పూజ చేసారు. ఆ సమయంలోనే ఆయనకి ఆ ఆలయ సంప్రదాయం ఒకటి తెలిసిందే. అదేమిటంటే ..అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట పూజారి చేతిలో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఈ విషయం తెలుసుకున్న సీఎం తానూ కొరడా దెబ్బలు దెబ్బలు తినేందుకు సిద్ధమయ్యారు.

తన కుడిచేతి చొక్కాను కొంచెం పైకి లాగారు . ఆలయం సంప్రదాయాలు పాటిస్తూ పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. ఆరు కొరడా దెబ్బలు పడిన తర్వాత ముఖ్యమంత్రి ఇక చాలు అన్నట్టుగా తన చేతిని వెనక్కు తీశారు. కొరడా దెబ్బలు తింటున్న సమయంలో ముఖ్యమంత్రి భూపేష్ భగల్ చాలా సంతోషం గా కనిపించారు. అనంతరం సీఎం.. పూజారిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఆ తరువాత సీఎం కి ఆలయ పూజారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Please Read Disclaimer