చిదంబరం అరెస్ట్… అమిత్ షా ప్రతీకారమా?

0

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం సుప్రీంకోర్టుతో పరిణామాలు మారాయి. 24 గంటల అజ్ఞాతం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమైన ఆయన.. మీడియాతో మాట్లాడి ఇంటికి వెళ్లిపోయారు.. అయితే ఆ వెంటనే చిదంబరం నివాసానికి సీబీఐ – ఈడీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో…గోడ దూకి మరీ లోపలికి ప్రవేశించిన అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఈ రాత్రి ఆయన్ను విచారించే అవకాశం ఉంది.

ఐఎన్ఎక్స్ కేసులో హైకోర్టు బెయిల్ విషయంలో కలకల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఉదయం సుప్రీంకోర్టులో చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ చిదంబరం తరపు లాయర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. తీర్పు ఇవ్వడానికి నిరాకరించిన జస్టిస్ రమణ.. దీనిపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం మీడియా సమావేశం నిర్వహించి ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.

విలేకరుల సమావేశంలో అనంతరం జోర్బాగ్లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్ అభిషేక్ మను సింఘ్వీ కూడా వెళ్లారు. సీబీఐ ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా చిదంబరం వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లు మూసివేశారు. దీంతో సీబీఐ సిబ్బంది గోడదూకి లోపలికి ప్రవేశించి ఢిల్లీ పోలీసుల సహాకారంతో చిదంబరాన్ని అరెస్ట్ చేశారు.

ఇదిలాఉండగా చిదంబరంపై ఈడీ దాడుల వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి.. జైల్లో వేయించారు.
Please Read Disclaimer