గోడ అంచుపై పరుగెత్తి.. భయపెట్టించింది

0

మన ఇంటి ముందున్న ప్రహరీ ఎక్కి దూకాలంటేనే మనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. ఇక ఆ గోడపై నడవాలంటే ససేమిరా ఒప్పుకోం. కానీ ఓ చిన్నారి ఏమాత్రం భయం లేకుండా గోడపై చకచకా అటూ ఇటూ బల్లిలా పరుగులు తీసింది. ఏ నాలుగడుగుల ఎత్తున్న ప్రహరీ మీదనో పరుగెత్తిందేమో అనుకునేరు. ఏకంగా నాలుగో అంతస్తులో ఉన్న కిటికి నుంచి బాల్కనీ మధ్యలో ఉన్న అంచుగోడపై ఆ చిన్నారి ఒళ్లుగగుర్పొడిచే సాహసం చేసింది.

స్పెయిన్‌లోని టెనిరిఫ్‌ అనే పట్టణంలో ఓ కుటుంబం అపార్టుమెంటు నాలుగో అంతస్తులో నివాసం ఉంటోంది. ఓ చిన్నారి తాము ఉండే అంతస్తులోని కిటికి నుంచి బయటికి వచ్చి గోడఅంచుపై పరుగెత్తుతూ బాల్కనీకి వైపు వెళ్లింది. అక్కడ నుంచి లోపలికి వెళదామని ప్రయత్నించింది. మళ్లీ ఎందుకో వెనక్కి తిరిగి కిటికి వైపు పరుగులు పెట్టింది. ఆ దృశ్యాన్ని సమీప భవనంలో ఉన్నవారు కెమెరాతో చిత్రీకరించారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను ఏకంగా 3.4 మిలియన్ల మంది చూడగా 25వేల మంది షాకింగ్‌ ఎమోజీలతో స్పందించారు. అయితే ఆ పాప ఎవరు, వాళ్ల తల్లిదండ్రులు ఎవరనేది తేలియరాలేదని పోలీసులు తెలిపారు.
Please Read Disclaimer