Templates by BIGtheme NET
Home >> Telugu News >> చైనా కరోనా వ్యాక్సిన్ కు పేటెంట్ హక్కులు !

చైనా కరోనా వ్యాక్సిన్ కు పేటెంట్ హక్కులు !


China Corona Vaccine Patented

China Corona Vaccine Patented

ప్రపంచాన్ని గ్గడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే రేసులో చైనా దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన క్యాన్ సినో బయోలాజిక్స్ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన ‘క్యాన్ సినో’ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ కరోనా 19 టీకా Ad5-nCOV కు గానూ చైనా పేటెంట్ హక్కులు పొందింది. ఈ వ్యాక్సిన్ తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయడానికి సంస్థ కృషి చేస్తుంది అని నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అడ్మిస్ట్రేషన్ వెబ్ సైట్ తెలిపింది. వ్యాక్సిన్ కి అనుమతి రావడం తో వ్యాక్సిన్ సామర్థ్యం .. సేఫ్టీ నిరూపితమైనది అని సంస్థ హర్షం వ్యక్తం చేసింది.

ఇకపోతే ఆ దేశానికి చెందిన ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రెగ్యులేటర్ వద్ద లభ్యమైన పత్రాల ఆధారంగా అక్కడి మీడియా ఈ వివరాలను ప్రకటించింది . కరోనా వ్యాక్సిన్ కు పేటెంట్ పొందిన తొలి సంస్థ క్యాన్ సినో అని బీజింగ్ ఆ హక్కులను ఆగస్టు 11నే జారీ చేసిందని చెప్పింది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ట్రయల్స్ కోసం పలు దేశాలతో చైనా చర్చలు జరుపుతోంది.