మళ్లీ చైనాలో కరోనా విజృంభణ!

0

కరోనావైరస్ పుట్టుకకి కారణమైన చైనా కరోనా పై విజయం సాధించాం అని ప్రకటించినా కూడా అక్కడ ఆ వైరస్ తగ్గిపోతున్నట్లు కనిపించి తాజాగా మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. ఒక్క రోజే 61 కొత్త కేసులు వచ్చాయి. ఏప్రిల్ తర్వాత… అత్యంత ఎక్కువ కేసులు నమోదైనది నిన్నే. చైనా జాతీయ ఆరోగ్య అధికారులు ఈ సమాచారం రిలీజ్ చేశారు. చైనా హ్యూబే ప్రావిన్స్ లోని వుహాన్ సిటీ లో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత అక్కడి అధికారులు అందరిని అప్రమత్తం చేయడం లో విఫలం అవ్వడంతో .. వైరస్ ప్రపంచం మొత్తం పాకింది.

చైనాలో గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ఈ 61 కేసుల్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కరోనాను నియంత్రించినట్లుగా భావిస్తూ సాధారణ జనజీవనాన్ని గడుపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. చైనా ఆగ్నేయ ప్రాంతంలోని గ్ఝిన్జియాంగ్ రీజియన్లో కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ రీజియన్ రాజధాని ఉరుంక్వీలో స్థానికంగా 57 కేసులు నమోదు అయ్యాయి. మరో నాలుగు కేసులు పొరుగు దేశాల నుంచి వచ్చిన వారి వల్ల వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 14వ తేదీన చైనాలో అత్యధికంగా ఒక్కరోజులో 89 కేసులు రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఇదే అత్యధికం.

దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు చైనా అధికారులు దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ మొదటికి వస్తుందేమోననే భయాందోళనలు పెరిగిపోతుంది. మరోసారి లాక్ డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులు కరోనా సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఆరున్నర లక్షల మంది కరోనా వైరస్ బలి తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.Please Read Disclaimer