ఎమ్మెల్యే తమ్ముడికి ఫార్చూనర్ కొనిచ్చిన సీఐ!

0

అధికారుల బదిలీలు రాజకీయ నేతలకు బంగారుబాతుల్లాంటివి అని రాజకీయం ఎరిగిన వాళ్లు చెబుతూ ఉంటారు. అలాంటి రాజకీయ బదిలీలకు చెక్ చెప్పడానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా వరకూ గట్టిగా ప్రయత్నించారు. పోలీసు అధికారుల బదిలీల విషయంలో సొంత పార్టీ నేతల విన్నపాలను జగన్ నిర్దద్వంద్వంగా పక్కన పెట్టారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలు ఆ విషయంలో జగన్ తీరు మీద బాగా అసంతృప్తికి గురి అయ్యినది ఆ విషయంలోనే. తాము చెప్పినట్టుగా పోలీసు అధికారుల బదిలీలు జరగలేని వారు వాపోయారు.

అయితే కొంతమంది ఘటికులు మాత్రం కొన్ని అనుకున్న బదిలీలు సాధించారు. అలాంటి వారిలో ఒకరట ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తమ్ముడొకరు. తమ నియోజకవర్గం పరిధిలోని ఒక సీఐ బదిలీ విషయంలో ఎమ్మెల్యే తమ్ముడు పట్టుబట్టి సాధించుకున్నాడట.

ఆ సీఐ కోరుకున్న బదిలీ చేయించినందుకు గానూ సదరు నేత భారీగా ప్రతిఫలం పొందాడట కూడా. ఏకంగా ఒక ఫార్చూనర్ వెహికల్ ను ఆ పోలీసు ఎమ్మెల్యే తమ్ముడికి కొనిచ్చాడంటే అది ఎంత ఖరీదైన బదిలీనో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

అధికారి కోరుకున్న బదిలీ జరిగినందుకు గానూ.. ఏకంగా అంత ఖరీదైన కారు ఆ ఎమ్మెల్యే తమ్ముడికి దక్కిందట. ఈ విషయమై ఇప్పుడు ప్రకాశం జిల్లాలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే తమ్ముడు పొందిన ఫార్చూనర్ కారుకు సంబంధించి అలా చర్చ జరుగుతూ ఉంది. ఒక్క బదిలీకి అంత భారీ కారు గిఫ్ట్ గా అందిందంటే.. సదరు సీఐ సంపాదన ఏ రేంజ్ లో ఉందనేది కూడా చర్చనీయాంశంగా మారింది!
Please Read Disclaimer